Tuesday, January 30, 2007

విదేశాలలో వున్న తెలంగాణ బిడ్డలార

విదేశాలలో వున్న తెలంగాణ బిడ్డలార,
విదేశాలలో వున్న తెలంగాణ బిడ్డలార వెనుకబడ్డ,ధగాబడ్డ,పురిటిగడ్డ గురించి నిరంతరం మమకారం,ఆవేదన,ఆలోచన,ఆచరన,భవిష్యత్ ప్రణాళికతో మీ ఆత్మలను మాతో పెనవేసిన అన్నలారా వందనం,అభివందనం.
తెలంగాణ సామాజిక,రాజకీయ,ఆర్థిక,భౌగోళిక,సాంస్కౄతిక స్వేచ్చ కోసం పరితపించే టిడిఫ్ మిత్రులారా స్వాగతం సుస్వాగతం.
కిరణ్ గారు చెప్పినట్టు 2009 ఎన్నికల్లో టిడిఫ్ సభ్యులందరు ఇక్కడి విద్యావంతులు మెధావులు,ఉపాధ్యాయులు,ఉద్యోగులు,విద్యార్దులతో కలసి ప్రచారం చేసి టీఆరెస్ ను గెలిపించాలి.చాల చక్కటి ఆలొచన స్వాగతిస్తున్నాం.టీఆరెస్ వాళ్ళు కూడ నిబధ్ధత కలిగిన విద్యావంతులు,నాయకులను మాత్రమే ఎన్నికలలో నిలపాలి.కాంగ్రెస్ వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పడానికి ఇది సరైన సమయం.వీరు తెలంగాణ ధ్రోహులుగా చరితార్ధులవుతారు.వారి వైఖరి నిర్ణయం,నిర్లక్ష్యం,చారిత్రక గుణపాఠం కావాలి.వాళ్ళ కుటిల రాజనీతిని కుతంత్రాలను తెలంగాణ ప్రజలు ఎండగడతారు.దశాబ్దాల నుండి తెలంగాణ ప్రజల ఉసురు పోసుకున్న వాళ్ళకు దోపిడీదారులకు,రాబందులకు,రాబోయే ఎన్నికలు కఠిన శిక్ష విధించాలి.తెలంగాణ మీద అవకాశవాదానికి అంతం ఏర్పడాలి.
ఈనాడు తెలంగాణ ప్రజలు మంత్రి పదవుల గురించి బాధ పడటం లేదు.ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు.యువత ఉడుకుతున్నరు.కరీం నగర్ ఆదర్శం.వాళ్ళ భావోద్వేగాలు చూస్తుంటే వూళ్ళకి వూళ్ళు ఉప్పెనగా గులాబి జండాలతో కదులుతై.ఇదంతా ప్రజల గుండె చప్పుడు,వారి ఆవేదన,వారి కసి.ఇది నిజం.ఇది ఖాయం.కుందూరు స్వరూప్ కి ధన్యవాదాలు. జై తెలంగాణ.
ఇట్లు,
భూపాల్ రెడ్డి,
కుక్కడం.
తుంగతుర్తి.

No comments: